Kalinga Movie: కళింగ సినిమాపై రిజల్ట్‌పై చిత్రబృందం స్పందన ఇదే..
- ‘కళింగ’ను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్
- సక్సెస్ మీట్‌లో హీరో
- దర్శకుడు ధృవ వాయు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalinga Movie: కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలాంటి ఓ కొత్త వ్యక్తి వచ్చి సినిమాను తీయడం.. హిట్టు కొట్టడం.. హౌస్ ఫుల్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీడియా సపోర్ట్ వల్లే మా సినిమా ఇంత వరకు వచ్చింది. వారి సహకారం వల్లే ఇంత పెద్ద హిట్ అయింది. వర్డ్ ఆఫ్ మౌత్‌తో మా సినిమా అందరికీ మరింత చేరువ అవుతోంది. మా సినిమాను ఇంత ఇష్టపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా చిత్రంలోని విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తామని మరోసారి తెలుగు ఆడియెన్స్ నిరూపించారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
Read Also: Honeymoon Express: అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ ఈ సినిమా మీద ముందు నుంచీ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆయన నమ్మకమే ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకు వచ్చింది. ఆయన వల్లే ఈ చిత్రం ఇంత గొప్పగా వచ్చింది. టెక్నికల్‌గా మూవీ అద్భుతంగా వచ్చిందని అందరూ ప్రశంసిస్తున్నారు. మా సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత పృథ్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘కళింగ సినిమాను ఇంత బాగా ఆధరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా సినిమాను ఇంత బాగా ముందుకు తీసుకు వెళ్తున్న మీడియాకు థాంక్స్’ అని అన్నారు.
హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ.. ‘నన్ను ప్రేక్షకులంతా కూడా పద్దు అనే పిలుస్తున్నారు. నా పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. గత మూడేళ్లుగా ఈ చిత్రం కోసం పని చేశాను. ఈ రోజు ఈ సక్సెస్ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ మాట్లాడుతూ.. ‘ధృవ వాయు కళింగ సినిమా కోసం రెండేళ్లు చాలా కష్టపడ్డాడు. అడవుల్లో షూటింగ్ చేశాం. ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండేవి కావు. కళింగ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అని ఆడియెన్స్ అంటున్నారు. సినిమాని చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయని అన్నారు. మా సినిమాకు ఇంత ప్రేమను ఇస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
కెమెరామెన్ అక్షయ్ మాట్లాడుతూ.. ‘కళింగ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. మా గురించి అందరూ బాగా రాశారు. టెక్నికల్ టీం గురించి మాట్లాడుతున్నారు. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన ధృవ వాయు గారికి థాంక్స్’ అని అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!