బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వచ్చిన పుకార్లపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపారు.
విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కండ్రికలో మంత్రి నారాయణ పర్యటించారు. బుడమేరు వరద బాధిత ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అల్లూరి జిల్లాలోని సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. విజయనగరంకు జిల్లాకు చెందిన 8 మంది శనివారం సరియా జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చారు. ఒకరు జలపాతంలో గల్లంతవ్వడంతో అతడిని రక్షించేందుకు ఇద్దరు నేవీ ఉద్యోగులు ప్రయత్నించారు.
ముంబయి నటి కాదంబరి జేత్వాని ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారని జేత్వాని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
స్టీల్ ప్లాంట్ సంక్షోభం రాజకీయ వేడిని రాజేస్తోంది. విశాఖ ఉక్కు మూసివేయడమే అంతిమ నిర్ణయం అయితే తన పదవికి రాజీనామా చేస్తానని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు.
నంద్యాల పట్టణ శివారులో వక్ఫ్ బోర్డ్ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి కూల్చడానికి వెళ్లిన అధికారుల బృందానికి చుక్కెదురైంది. ఆ ఇంటి యజమాని తన ఇంటిని కూలిస్తే చనిపోతానని బెదిరించాడు. కూల్చడానికి సిద్ధమవుతున్న తహసీల్దార్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఇంటి యజమాని ఉరుకుంద.
తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌ల యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థి లోకేశ్‌ను మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థిగా గుర్తించారు.
రూ. 2వేల పందెం కోసం మున్నేరులో దూకిన యువకుడు గోపిచంద్ మృతదేహం లభ్యమైంది. ఘటన జరిగిన 6 రోజుల తర్వాత గోపిచంద్ మృతదేహం దొరికింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గల మున్నేరులో గోపిచంద్ గల్లంతైన సంగతి తెలిసిందే.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకుని టీ తాగిన వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు.