అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట భూ నిర్వాసితులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. అన్నమయ్య, పించా డ్యాములు తెగిపోయి ప్రాణాలు కోల్పోయిన వారిని కానీ నష్ట పోయిన వారిని కానీ జగన్ ఒక్కరినైనా ఆదుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు.
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ జరగనుందని తెలిపారు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలకు సాకారం లభించిందన్నారు.
బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరం వద్ద ఏసుబాబు అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలతో ఏసుబాబు అక్కడికక్కడే మృతి చెందారు.
గవర్నమెంట్ స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారని విమర్శించారు. తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని ఆరోపించారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పోకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్లుశాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా.. విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పోడియంను రెవెన్యూ సీఎస్ సిసోడియా స్వయంగా పగలగొట్టారు.
విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విశాఖ జంక్షన్‌లో ఉత్తరాది రాష్టాలకు తొలి సెమీ హైస్పీడ్ రైలుగా ఈ వందేభారత్ రైలు నిలిచింది. ఏపీ,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ రైలు ప్రయాణించనుంది.
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు H బ్లాక్ ఆపరేషన్ ప్రారంభమైంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది.
Saripodhaa Sanivaaram: దర్శకుడు వివేక్ ఆత్రేయ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిపోదా శనివారం’ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్‌ను బద్దలు కొట్టి గొప్ప బాక్సాఫీస్ మైలురాయిని సాధించింది. ఈ చిత్రం అన్ని చోట్లా విజయవంతంగా దూసుకుపోతూనే ఉంది. మూడవ వారాంతంలో కూడా థియేటర్లలో తన హవాను కొనసాగిస్తోంది. నాని మరో అద్భుతమైన నటనతో […]
స్టార్ నటుడు కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ధీరన్ అధిగారం ఒండ్రు, అరువి, ఖైదీ, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రాబోతోంది. అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో హీరో కార్తీ ప్రేక్షకులని అలరిస్తున్నారు.