ఏపీలో వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఎన్యూమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం ఆరా తీశారు.
ఈనెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని విజయవతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి సంబంధించి గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి...అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని అన్నారు.
అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.
ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపుల పరిశీలనకు కేబినెట్ సబ్ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది.
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది జరిగిన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సంగారెడ్డి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు.
ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలు సెక్రటేరియట్‌కు చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యాయి. గత రెండు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి.
సీతారాం ఏచూరి మృతితో.. అటు కమ్యూనిస్ట్ వర్గాల్లో, దేశ రాజకీయాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సీనియర్ సీపీఎం నేత సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.