ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్-2024’లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు.
ఇటీవల ఏపీలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. తాజాగా వాతావరణ శాఖ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తిరుపతిలో సినిమా థియేటర్‌లో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం కానుంది. కొత్త మద్యం విధానంపై కీలక విషయాలను మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశంలో వెల్లడించింది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్ , సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్‌లు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించామని వారు తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని.. స్టీల్ ప్లాంట్‌ని కాపాడి, లాభాల్లోకి తీసుకురావాలనేదే కేంద్రం ఉద్దేశమని పురంధేశ్వరి వెల్లడించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్‌లోని గాంధీనగర్‌కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు.
గణపతి నవరాత్రోత్సవాల వేళ భక్తులు గణేశుడి నామస్మరణలో మునిగిపోయి ఉంటే.. మరో వైపు క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుందూ నది సమీపంలో ముళ్ల పొదల్లో ముగ్గు వేసి నల్ల కోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు కనిపించాయి.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, పెట్టుబడులకు ఆహ్వానంపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చే నూతన విధానాల గురించి పారిశ్రామిక వేత్తలకు వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.