Saripodhaa Sanivaaram: దర్శకుడు వివేక్ ఆత్రేయ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిపోదా శనివారం’ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్‌ను బద్దలు కొట్టి గొప్ప బాక్సాఫీస్ మైలురాయిని సాధించింది. ఈ చిత్రం అన్ని చోట్లా విజయవంతంగా దూసుకుపోతూనే ఉంది. మూడవ వారాంతంలో కూడా థియేటర్లలో తన హవాను కొనసాగిస్తోంది.
నాని మరో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుస హిట్‌లు నానికి పెరుగుతున్న ప్రజాదరణను సూచిస్తున్నాయి. ఎస్‌జే సూర్య, నానిల మధ్య ఘర్షణ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా చూసి విలన్ గురించి కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఎస్‌జే సూర్య నటన అంత అద్భుతంగా ఉంది. ఈ రెండు పవర్‌హౌస్ ప్రతిభల మధ్య డైనమిక్ ముఖాముఖి ప్రేక్షకులను ఆకర్షించింది, దృశ్య విందును అందించింది. సరిపోదా శనివారం దేశీయంగా, ఓవర్సీస్‌లో స్థిరమైన కలెక్షన్లను రాబడుతోంది. ఉత్తర అమెరికాలో 2.48 మిలియన్ల గ్రాస్‌తో ఈ చిత్రం జోన్‌లో 2.5 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. ఇది ఇప్పటికే ఉత్తర అమెరికాలో నానికి బిగ్గెస్ట్ గ్రాసర్. మునుపటి బ్లాక్ బస్టర్ ‘దసరా తర్వాత’ 100 కోట్ల మైలురాయిని చేరుకున్న నాని రెండో చిత్రంగా ‘సరిపోదా శనివారం’ నిలిచింది. దసరా చిత్రం మంచి వసూళ్లతో పాటు తాజాగా పలు విభాగాల్లో సైమా-2024 అవార్డులను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. ఉత్తమ హీరోగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్, ఉత్తమ డైరెక్టర్‌గా శ్రీకాంత్, ఉత్తమ సహాయ నటుడిగా దీక్షిత్ శెట్టి అవార్డులు అందుకున్నారు. నాని హీరోగా నూతన దర్శకుడు తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’ కూడా ‘సైమా’ పురస్కారాలు సొంతం చేసుకుంది.