ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఓ భారీ బోటును బయటకు తీయగలిగారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న 40 టన్నుల బరువున్న భారీ బోటును బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు.
ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీఅమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
విశాఖ ఉక్కుని శాశ్వతంగా లాభాల బాట పట్టేలా కార్యాచరణ ప్రణాళిక చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్రానికి సెంటిమెంటు అని, ప్రైవేటు పరం కానీయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి గత ప్రభుత్వ వైఖరి కూడా ఓ కారణమని విమర్శించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ కాకుండా.. గతంలో ఆపింది తానేనని సీఎం తెలిపారు.
బుడమేరు వరద బెజవాడను అతలాకుతలం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం వచ్చిన విపత్తులాంటి విపత్తును గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఊహించని స్థాయిలో వరద రావడం.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. బుడమేరు కబ్జాల వల్ల విపత్తు సంభవించిందని ఆయన అన్నారు. మేం అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాక ముందే అతి పెద్ద విపత్తు వచ్చిందని సీఎం పేర్కొన్నారు.
ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బీసీ ప్రొటెక్షన్ యాక్టు రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించనున్నామని, ఈ మేరకు బీసీ ప్రొటెక్షన్ చట్టం రూపకల్పనపై సీఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి సవిత వెల్లడించారు.
పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ విషయానికి సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో బుధవారం నాడు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల్ని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.