Kanwar Yatra: పవిత్ర కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. శివభక్తులు గ్వాలియర్ నుంచి యూపీలోని హరిద్వార్ మీదుగా తమ సొంత జిల్లాకు వెళ్తుండగా.. హత్రాస్‌లోని సదాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో కన్వర్ యాత్రకు వెళ్లిన ఏడుగురు భక్తులను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. గ్వాలియర్ నుండి భక్తులు హరిద్వార్ నుండి తమ సొంత జిల్లాకు వెళుతుండగా, వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని ఆగ్రా జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కృష్ణ తెలిపారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ట్రక్ డ్రైవర్ గురించి తమకు సమాచారం అందిందని రాజీవ్ కృష్ణ చెప్పారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. హిందువుల పవిత్ర మాసం శ్రావణంలో గంగా నది నీటిని తీసుకొచ్చి దేవుడికి సమర్పించేందుకు శివుని భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్, గౌముఖ్, ఇతర ప్రదేశాలకు కాలినడకన కన్వర్ యాత్ర సాగిస్తారు.ఈ వారం ప్రారంభంలో హరిద్వార్‌లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది ప్రవాహానికి ఏడుగురు భక్తులు కొట్టుకుపోయారు. కన్వర్ యాత్ర.. ఇది హరిద్వార్, గౌముఖ్, ఇతర ప్రాంతాలలో ఏటా నిర్వహించబడే ఒక యాత్ర. గత రెండేళ్లలో ఇది కరోనా మహమ్మారి కారణంగా జరగలేదు.
Labours stuck in Flood: వాగులో చిక్కుకున్న 23 మంది కూలీలు సేఫ్.. ఒడ్డుకు చేర్చిన సహాయక బృందాలు
ఇదిలా ఉండగా శ్రావణంలో జరుగుతున్న కన్వర్ యాత్ర కారణంగా జులై 25, 26 తేదీల్లో హరిద్వార్, మీరట్, మొరాదాబాద్‌లలోని విద్యాసంస్థలు మూసివేయబడతాయి. జులై 25, 26వ తేదీల్లో రెండు రోజులు విద్యాసంస్థలు తెరుచుకోబోవని, భక్తులు ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేందుకు వీధుల్లో ఉంటారని, ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు తెలిపారు.