Cyber Fraud: ఆన్‌లైన్‌లో పెసర పప్పు ధరపై ఫిర్యాదు.. రూ.5 లక్షలు మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: కాకినాడలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన పెసర పప్పు ధర ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి లక్షలాది రూపాయాలు మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి హనుమంతరావు ఆన్‌లైన్ యాప్‌లో పెసరపప్పు ఆర్డర్ చేశారు. ఆర్డర్ సమయంలో ధర రూ.53గా చూపించగా, డెలివరీ సమయంలో బిల్లులో మాత్రం రూ.111 వసూలు చేసినట్లు తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేయాలని భావించిన ఆయన, డెలివరీ బాయ్ వద్ద నుంచి మేనేజర్ నెంబర్ తీసుకుని కాల్ చేశారు. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడడంతో కాల్ కట్ చేశారు. ఆ తర్వాత అదే నెంబర్ నుంచి ఆరు సార్లు కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయలేదని చెప్పారు. కానీ, కొద్ది సేపటికి తన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం రూ.5 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయని బాధితుడు వెల్లడించారు. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారణ చేయగా, ఇది సైబర్ మోసం అని నిర్ధారణ అయింది.
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
– తెలియని నంబర్లకు వ్యక్తిగత/బ్యాంక్ వివరాలు చెప్పకండి
– OTPలు, లింకులు ఎవరితోనూ షేర్ చేయకండి
– ఫిర్యాదుల కోసం అధికారిక కస్టమర్ కేర్ నంబర్లు మాత్రమే ఉపయోగించండి
– అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇవ్వండి
– 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి
ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని పోలీసు అధికారులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!