Hyderabad Metro: ఇటీవల మెట్రో రైలులో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మెట్రో రైలు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో చేసిన యువతిపై మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ప్రజలకు హైదరాబాద్ మెట్రో సంస్థ స్ట్రాంగ్ నోటీసు ఇచ్చింది. మెట్రో సంస్థలకు ఎలాంటి నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్‌కు సంబంధించిన ప్రాపర్టీల్లో పోస్టర్లు అతికించడం/పెట్టడం వంటివి చేయొద్దన్నారు. ఏదైనా విషయాన్ని రాయడం, గీయడం లాంటి నష్టం కలిగిస్తే చర్యలుంటాయన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసిన లేదా పోస్ట్ చేసిన ఏదైనా బోర్డు, డాక్యుమెంట్‌లను క్రిందికి లాగకూడదని, ఉద్దేశపూర్వకంగా పాడు చేయకూడదని నోటీసులో వెల్లడించారు. అలాంటి బోర్డు లేదా డాక్యుమెంట్‌లపై, ఏదైనా ఇతర హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాపర్టీలపై ఉన్న అక్షరాలు లేదా బొమ్మలను తుడిచివేయకూడదని, మార్చకూడదని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో ప్రాంగణంలో ఏ అనధికార కార్యకలాపాన్ని నిర్వహించకూడదని నోటీసులో వెల్లడించారు.
Telangana Floods: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్.. వరద పరిస్థితిపై ఆరా
హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులు, ప్రాంగణంలో ఏదైనా అనధికారిక కార్యకలాపాలు, నష్టం కలిగించడం లాంటివి చేసిన వారిపై చర్యలుంటాయని హైదరాబాద్ మెట్రో రైస్ వెల్లడించింది. ఏ వ్యక్తి అయినా అలా చేసినట్లు గుర్తించినట్లయితే, మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & మెయింటెనెన్స్) చట్టం- 2002లోని సెక్షన్ 62ఆర్‌డబ్ల్యూ, సెక్షన్ 72 ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని, వెయ్యి రూపాయల వరకు జరిమానా విధి లేదా రెండింటిని కూడా విధించే అవకాశం ఉందని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ నోటీస్‌ను బహిరంగంగా విడుదల చేసింది. మెట్రో సంస్థకు ఎలాంటి నష్టాన్ని కలగజేయవద్దని ప్రజలను కోరింది.