Mumbai: మహారాష్ట్రలో ముంబైలోని శివాజీ నగర్ బైగన్‌వాడి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం నలుగురు శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు. మృతులు 34 ఏళ్ల షకీల్ జలీల్ ఖాన్, అతని భార్య నజియా షకీల్ ఖాన్‌తో పాటు వారి 7 ఏళ్ల కుమారుడు సుపారీ, మూడేళ్ల కుమార్తెగా గుర్తించారు.
Arpita Mukherjee: నటి అర్పితా ముఖర్జీకి నాలుగు లగ్జరీ కార్లు.. వాటి నిండా డబ్బే!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తమకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా సీలింగ్‌కు వేలాడుతున్న వ్యక్తి మృతదేహం కనిపించిందని.. మిగిలిన మూడు మృతదేహాలు నేలపై పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు. చుట్టుపక్కల ప్రజలను పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎటువంటి సూసైట్ నోట్ లభించలేదని, ఈ కేసులో అనుమానితులెవరూ లేరని పోలీసులు పేర్కొన్నారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.