రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. సభను, సభాపతి అధికారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సభా వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని డిప్యూటీ చైర్మన్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విద్యార్థితో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఈ ఘటన పోఖారీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగింది.
మనదేశంలో ఓటర్ జాబితా పేరు నమోదు చేసుకుని ఓటరు కార్డు పొందాలంటే 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. ఇకపై ఓటరు కార్డు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటరు జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివాసముంటున్న ప్రియాంక గుప్తా తన ఇంటి కరెంట్ బిల్లును చూసి షాక్‌కు గురైంది. ఆ బిల్లును చూస్తే ఆమే కాదు.. చూసిన వారెవరైనా షాక్ అవ్వాల్సిందే. రూ. 3,419 కోట్ల విద్యుత్ బిల్లును చూసి ఆమె మామ అయితే ఏకంగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు.
భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతానికి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంపై ఎలాంటి ప్రతిపాదన లేదని కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.
స్వార్మ్ డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కార్బైన్లతో సహా సాయుధ దళాల కోసం 28,732 కోట్ల రూపాయల విలువైన సేకరణ ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది.
దేశరాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌పై ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకుడిని జుట్టు పట్టుకుని కారు లోపలికి పోలీసులు నెట్టేశారు. స్థానికంగా గుమిగూడిన మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న శ్రీనివాస్‌ను బలవంతంగా కారు లోపలికి తోసేశారు.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థుల బృందం జూనియర్లను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల వివరాలు వెల్లడి కాలేదు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ దఫా విచారణకు హాజనైన సోనియా గాంధీ తాజాగా మంగళవారం మరోసారి విచారణకు హాజరయ్యారు.
రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.