IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బస్సెటెర్రేలోని వార్నర్ పార్క్‌లో జరుగుతున్న మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ బ్యాటర్లు బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. గత రాత్రి జరిగిన రెండో టీ20లో విండీస్ గెలవడంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ పోరులో భారత్ విజయం సాధించి ఆధిక్యంలో నిలవాలని చూస్తోంది. గత రాత్రి ఇదే వేదికపై వెస్టిండీస్ తక్కువ స్కోరు గల థ్రిల్లర్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమమైంది. వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ అత్యుత్తమ బౌలింగ్ చేసాడు. 17 పరుగులకు ఆరు వికెట్లు తీసుకొని భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు.
Common Wealth Games 2022: టేబుల్ టెన్నిస్‌లో అద్భుత విజయం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.
వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), షిమ్రన్ హెట్మెయర్, డివాన్ థామస్, రోమన్ పావెల్, డొమినిక్ డ్రేక్స్, జేసన్ హోల్డర్, అకియల్ హోసీన్, అల్‌జారీ జోసెఫ్, ఒబెద్ మెకాయ్.