Common Wealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో సింగపూర్‌తో జరిగిన ఆటలో 3-1 తేడాతో భారత్ స్వర్ణాన్ని సాధించింది. అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఫైనల్‌లోనూ శుభారంభం చేసింది. డబుల్స్ జోడీ సత్యన్ జ్ఞానశేఖరన్ , హర్మీత్ దేశాయ్ తమ మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించారు. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో భారత్‌కు ఇది ఐదో స్వర్ణం. ఆ ఈవెంట్‌లో సత్యన్ స్టార్‌గా నిలిచాడు. దీంతో ఇప్పటివరకు భారత్ మొత్తం 11 పతకాలు సాధించింది. అందులో ఐదు బంగారు పతకాలు కాగా, 3 రజతం, 3 కాంస్యాలు ఉన్నాయి.
CWG 2022: లాన్‌బౌల్స్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన మహిళల జట్టు గురించి తెలుసా?
2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇదే ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. మళ్లీ ఇప్పుడు బంగారు పతకాన్ని సాధించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో నైజీరియాను ఓడించింది.