Russia-Ukraine: గత కొన్ని నెలలుగా రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులు, ఉక్రెయిన్ ప్రతి దాడులతో మొదలైన యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇరువైపులా జవాన్లు మరణించారు. ఈ రెండు దేశాల మధ్య ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్ ఇలా వార్‌లో ఉండగానే.. ఆ దేశాలకు చెందిన యువకుడు, యువతి మాత్రం ప్రేమలో పడ్డారు. విద్వేషాలకు ప్రేమ అతీతమంటూ రష్యాకు చెందిన అబ్బాయి, ఉక్రెయిన్‌కు చెందిన అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ యుద్ధం ఈ ప్రేమ జంటను విడదీయలేకపోయింది. ఉక్రెయిన్‌కు చెందిన యువతి, రష్యాకు చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో హిందూ సాంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
Israel Attack On Gaza: పాలస్తీనాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్..
రష్యా పౌరుడు సెర్జీ నొవికోవ్, ఉక్రెయిన్‌కు చెందిన ఎలొనా బ్రమోకాలు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాల నిమిత్తం కొన్నాళ్లు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. సుమారు ఏడాది కాలంగా వీరు హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. స్థానికులు ధర్మశాలకు సమీపంలోని ఖరోటా దివ్య ఆశ్రమంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వారి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఈ వివాహానికి వధూవరుల విదేశీ స్నేహితులు కూడా హాజరై ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రేమ చాలా గొప్పదంటూ ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.