Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?.. మాస్టర్ ప్లాన్ చెప్పిన హర్భజన్ సింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన బుడ్డోడు.. అనంతరం భారత సీనియర్ జట్టులో కూడా అరంగేట్రం చేశాడు. 2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని భారీ సిక్సులు బాదాడు. అనంతరం జింబాబ్వే పర్యటనలో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఈ యువ సంచలనాన్ని ఎలా అడ్డుకోవాలనే ప్రశ్నకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
వైభవ్‌ను ఎదుర్కొనేటప్పుడు రక్షణాత్మకంగా బౌలింగ్ చేయడం సరైన వ్యూహం కాదని, అతడిపై దాడి చేసే ధోరణితోనే బౌలింగ్ చేయాలని హర్భజన్ సింగ్ సూచించాడు. ‘వైభవ్ ఎలా ఆడుతున్నాడో మనం చూశాం. అతడు ఏం చేస్తున్నాడో చూసి నా ఫీల్డింగ్‌ను సెట్ చేయను. నేను ప్లాన్ ప్రకారమే ఫీల్డింగ్‌ను ఏర్పాటు చేస్తాను. నన్ను నేను కాపాడుకోవడానికి బౌలింగ్ చేస్తే వర్కౌట్ కాదు. వైభవ్‌ను ఎదుర్కొనే ఏకైక మార్గం దాడి చేయడమే. అయితే ఆ వ్యూహం ప్రతిసారి పనిచేయకపోవచ్చు. వైభవ్ కొన్ని సిక్సర్లు కొట్టొచ్చు. అయినప్పటికీ తర్వాతి బంతికి కూడా అదే ప్రణాళికతో వెళ్లాలి. అప్పుడే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి’ అని యాష్ పేర్కొన్నాడు.
Also Read
వైభవ్‌కు బౌలర్లు భయపడుతూ రక్షణాత్మకంగా వ్యవహరిస్తే.. అతడికే మరింత ఆధిక్యం లభిస్తుందని హర్భజన్ సింగ్ అంటున్నాడు. అతడి దూకుడు బ్యాటింగ్‌ను అడ్డుకోవాలంటే వికెట్ తీసే ఉద్దేశంతోనే బంతులు వేయాలని సూచించాడు. వైభవ్ ప్రతిభను హర్భజన్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ‘వైభవ్ అద్భుతమైన ఆటగాడు. ఇలాంటి ఆటగాడిని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. 14-15 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని రూల్ చేసేలా ఆడుతున్నాడు. ప్రపంచంలోని టాప్ బౌలర్లే అతడికి ఎక్కడ బౌలింగ్ చేయాలో ఆలోచించాల్సి వస్తోంది. అది చిన్న విషయం కాదు’ అని హర్భజన్ చెప్పాడు. వైభవ్ ప్రదర్శనలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా మారుతాయని హర్భజన్ పేర్కొన్నాడు. దేశంలోని ఎంతో మంది యువ క్రికెటర్లు ఇప్పుడు వైభవ్‌లా ఎదగాలని కలలు కంటున్నారని, బుడ్డోడు ఒక స్ఫూర్తిగా నిలుస్తాడని అభిప్రాయపడ్డాడు.
వైభవ్ కేవలం టీ20 క్రికెట్‌కే పరిమితం అవుతాడనే అభిప్రాయాన్ని మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ ఖండించాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లోనూ సక్సెస్ సాధించే సామర్థ్యం అతడికి ఉందని తెలిపాడు. ‘వైభవ్ టీ20 ప్లేయర్ మాత్రమేనని కొందరు అంటున్నారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. అతడికి లాంగ్ ఫార్మాట్లోనూ విజయవంతం అయ్యే సామర్థ్యం ఉంది. ఫిట్నెస్ అవసరం. కానీ దానికంటే మానసిక బలం చాలా ముఖ్యం. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వంటి భారీ టోర్నీలో పాల్గొనడమే కాకుండా.. అందులో రాణించే ధైర్యం, నిబద్ధత చూపించాడు. ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదగడానికి కావాల్సిన ఎన్నో లక్షణాలు అతడిలో ఉన్నాయి’ అని హేడెన్ వివరించాడు. సూర్యవంశీపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
-
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!