Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 18,738 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 40 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 18,558 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశంలో 3,72,910 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Delhi: పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌పై రౌడీ మూక దాడి.. వీడియో వైరల్
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,26,689 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,34,933 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,34,84,110 మంది కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,40,78,506కు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 29,58,617 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205.21 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 6,40,086 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మరో 1,279 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,87,26,234 కు చేరింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా 64,35,522 మంది మరణించారు. ఒక్కరోజే 8,26,530 మంది కోలుకున్నారు. జపాన్‌లో ఒక్కరోజే 2,36,809 కేసులు నమోదు కాగా.. 189 మంది మరణించారు.