Israel Strikes: రాకెట్ల దాడితో ప్రతీకారం తీర్చుకున్న పాలస్తీనా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ బాంబు దాడులను విస్తరించడంతో గాజాలో వాతావరణం హింసాత్మకంగా మారింది. పాలస్తీనా ఉద్యమం ఇస్లామిక్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ బ్రేకింగ్ డాన్ కింద గాజా స్ట్రిప్‌ను లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడుల కారణంగా 24 మంది మరణించగా.. మరో 203 మంది గాయపడ్డారు. “గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఫలితంగా, ఆరుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా 24 మంది మరణించారు.203 మంది గాయపడ్డారు” అని పాలస్తీనా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
శుక్రవారం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా స్ట్రిప్‌లో ఇస్లామిక్ జిహాద్ ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రేకింగ్ డాన్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. దీంతోపాటు క్షిపణి దాడులను చేపట్టింది. ప్రారంభంలో 10 మంది మరణించగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వైమానిక దాడుల తరువాత, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ నఖలా.. టెల్ అవీవ్‌పై క్షిపణి దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించాడు. ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టింది. గాజా స్ట్రిప్‌పై కొత్త దాడులను కొనసాగిస్తూనే క్షిపణి దాడులను తిప్పికొట్టింది.
Lightning Strike: చమురు నిల్వ కేంద్రంలో పిడుగు.. 80 మందికి గాయాలు, 17మంది మిస్సింగ్
పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపు ఇచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఇజ్రాయిల్ దాడులు చేసినట్లు ప్రధాని యాయిర్ లాపిద్ తెలిపారు. తొలుత ఇజ్రాయిల్‌పై పీఐజే సుమారు వంద రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇజ్రాయిల్‌కు చెందిన ఐరన్ డోమ్ ఆ క్షిపణులను అడ్డుకుంది. ఇజ్రాయిల్‌లోని అనేక పట్టణాల్లో సైరన్లు మోగాయి.పాలస్తీనా మిలిటెంట్ల దాడులకు ప్రతీకారంగా.. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శుక్రవారం దాడుల్ని ప్రారంభించింది. వివిధ మిలిటెంట్ల స్థావరాలను టార్గెట్ చేశారు. పీఐజేతో లింకు ఉన్న సైట్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.గాజా సిటీలో ఉన్న బహుళ అంతస్తుల పాలస్తీనా టవర్‌ను కూడా పేల్చేశారు. గాజాలో రోజువారీ జీవితం నిలిచిపోయింది. అయితే ఇజ్రాయెల్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసిన తర్వాత ఇంధన కొరత కారణంగా ఏకైక పవర్ స్టేషన్ మూసివేయబడిందని విద్యుత్ పంపిణీదారు తెలిపారు. రాబోయే కొన్ని గంటలు చాలా కష్టతరంగా మారనున్నాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యుత్ కొరత ఫలితంగా 72 గంటల్లో కీలక సేవలను నిలిపివేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది