Tinder: ఎంత ఉత్తముడు.. డేటింగ్ యాప్‌లో వారి కోసం వెతికాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tinder: సాధారణంగా ప్రేమ, సాంగత్యం కోసం టిండర్ అనే డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తుండగా.. ఓ వ్యక్తి రక్షా బంధన్ కోసం సోదరీమణులను వెతుక్కోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించాడు. నిజమేనండి.. అతనికి ఇద్దరు సోదరీమణులు కూడా దొరికారు. అతనే స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు రాఖీ పండుగను ఆస్వాదించాలనుకున్నాడు. కానీ తనకు సొంత అక్కాచెల్లెళ్లు లేరు. దాంతో ఏం చేయాలని బాగా ఆలోచించాడు. వెంటనే బుర్రలోకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. డేటింగ్ యాప్ అయిన టిండర్‌లో సెర్చింగ్ మొదలుపెట్టాడు. తనకు మంచి సోదరిగా మెలిగే వ్యక్తి కోసం వెదికాడు. ఇంకేముంది అతనికి ఇద్దరి అమ్మాయిలు దొరికేశారు. దీంతో రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ఆ వ్యక్తి రెడీ అయిపోయాడు. అతనే సోషల్ మీడియాలో ఈ విధంగా వెల్లడించాడు. రక్షాబంధన్ సందర్భంగా తను మంచి సోదరి కోసం వెదికానని చెప్పాడు. తనకు రాఖీ కట్టడానికి .. గిఫ్ట్‌లు ఇవ్వడానికి ఎవరూ లేరని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది టిండర్‌లో చెల్లెళ్లు కోసం వెదికానని, ఇద్దరు దొరికారని .. ఇక రాఖీ పండుగ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. వారితో రాఖీ పండుగను జరుపుకోబోతున్నట్టు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆ యువకుడు టిండర్ యాప్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. అయితే దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
Also Read
Saibal Bhattacharya: నా భార్య, అత్తా అంటూ లైవ్ లో నటుడు సూసైడ్.. వీడియో వైరల్
గతంలో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ డేటింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో ఒక వ్యక్తి అద్దెకి ఫ్లాట్‌ను వెదికాడు. ముంబైలో ఫ్లాట్ కోసం చూస్తున్నానని సంబంధిత యాప్ బయోలో రాశాడు. అంతేకాదు. “మీరు ముంబైలో ఉంటే కుడివైపుకి స్వైప్ చేయండి. నాకు హిందీ తెలియదు కాబట్టి వెస్ట్రన్ లైన్‌లో అద్దెకు ఫ్లాట్‌ను కనుగొనడంలో నాకు సాయం చేయండి.” అని రాశాడు. మరీ ఆయన ప్రయత్నాలు ఫలించాయో లేదో తెలియదు.. అప్పట్లో ఈ వార్త ట్రెండ్ అయింది. దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!