SC Classification: ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అమలు చేయాలని సుప్రీంకోర్టులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిటిషన్ దాఖలు చేయగా.. నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్లు లేకపోవడం వల్ల నష్టపోతున్నామని, వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టును కోరామని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణపై కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరామన్నారు.
Nitish Kumar: బిహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
కేంద్ర రాష్ట్రాల వైఖరి తెలుసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపిందని మందకృష్ణ వెల్లడించారు. వర్గీకరణ జరిగితేనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని మందకృష్ణ కోరారు.