Peace Commission: మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఐదేళ్ల కాలానికి ఆయా దేశాల మధ్య సంధిని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్‌ను రూపొందించడానికి యూఎన్‌కు రాతపూర్వక ప్రతిపాదనను సమర్పించాలని యోచిస్తున్నట్లు ఎంఎస్‌ఎన్ వెబ్ పోర్టల్ నివేదించింది. అయితే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఆ కమిషన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్‌లో భారత ప్రధాని పేరుని ప్రతిపాదించినట్లు తెలిపారు. తాను రాత పూర్వకంగా ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితికి అందజేస్తానని కూడా చెప్పారు.
అత్యున్నత కమిషన్‌లో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ఆంటోనియో గుటెర్రెస్, భార ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉండాలని మెక్సికో అధ్యక్షుడు ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపడానికి ఒక ప్రతిపాదనను సమర్పించడం, కనీసం ఐదేళ్లపాటు సంధిని కోరుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడం కమిషన్ యొక్క లక్ష్యం. ఆ ముగ్గురు నాయకులు ప్రతి చోట యుద్ధాన్ని ఆపేసేలా ఒక ప్రతిపాదనను అందజేయడమే కాకుండా ఐదేళ్ల యుద్ధాన్ని నిలిపేసేలా ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ప్రజలను, ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి శాంతిగా ఉంటాయన్నారు. ఓ సంధి కారణంగా ఎలాంటి హింస లేకుండా శాంతితో ఉంటాయని మెక్సికో అధ్యక్షుడు తెలిపారు.
Srilkana: శ్రీలంకలో నిరసనలకు తెర.. 4నెలల తర్వాత కీలక పరిణామం
యుద్ధప్రాతిపదికన చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిస్తూ, మెక్సికన్ అధ్యక్షుడు చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్‌లను శాంతిని కోరేందుకు ఆహ్వానించారు. ఈ మూడు దేశాలు తాము ప్రతిపాదిస్తున్న మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఈ ప్రతిపాదిత సంధి తైవాన్, ఇజ్రాయోల్, పాలస్తీనా వంటి దేశాలతో కూడా ఒప్పందం చేసుకునేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. అదీగాక ఈ ఒక్క ఏడాదిలోనే ఎన్నో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, ఎంతోమంది ప్రజలు చనిపోవడం, నిరాశ్రయులవ్వడం జరిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలు యూఎన్‌కు మద్దతుగా చేరాలని ఆయన కోరారు.