PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం దేశ రాజధానిలోని తమ నివాసంలో చిన్నారులతో కలిసి రక్షా బంధన్‌ను జరుపుకున్నారు. ఈ చిన్నారులు ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్లు, గుమస్తాలు, తోటమాలి, డ్రైవర్లు మొదలైన వారి కుమార్తెలు కావడంతో ఈ రక్షాబంధన్ ప్రత్యేకతను చోటుచేసుకుంది. సందర్భంగా చిన్నారులతో కలిసి పండుగ జరుపుకుంటున్న ప్రధాని మోడీ వీడియోను పీఎంవో షేర్ చేసింది. రాఖీ కట్టేందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తుండగా ప్రధాని వారితో సంభాషించడం వంటి దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. ప్రధాని మోడీ చిన్నారులతో మాట్లాడి వారిని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘రక్షా బంధన్ సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రక్షాబంధన్ సందర్భంగా ప్రధానికి పాకిస్థాన్ నుంచి ఖమర్ మొహ్సిన్ షేక్ అనే మహిళ రాఖీ పంపారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ ఆకాంక్షించారు. ఆమె ప్రధాని మోడీని కలవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఎంబ్రాయిడరీ డిజైన్‌తో కూడిన రేష్మి రిబ్బన్‌ని ఉపయోగించి తానే స్వయంగా ఆ రాఖీని తయారు చేసినట్లు తెలిపారు.
Election Commission of India: “సాలు దొర- సెలవు దొర” ప్రచారంపై ఈసీ అభ్యంతరం.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. “రక్షాబంధన్ శుభ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు” అని షా ట్వీట్ చేశారు.
#WATCH | Prime Minister Narendra Modi celebrated #RakshaBandhan with young girls today at his residence in Delhi.
This was a special Rakshabandhan as these girls were the daughters of sweepers, peons, gardeners, drivers, etc working at PMO.
(Video Source: PMO) pic.twitter.com/eSvd6gsgHb
— ANI (@ANI) August 11, 2022
#WATCH | Har Ghar Tiranga at the PM’s residence
After the Rakshabandhan celebrations, PM gave a Tiranga to every child to mark the #HarGharTiranga Abhiyan in a unique way.
(Video source: PMO) pic.twitter.com/h3IeTeDqGT
— ANI (@ANI) August 11, 2022