Tvk Vijay : విజయ్ కు షాక్.. ఎన్నికల తర్వాతే విజయ్ ‘జననాయగన్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా ఈ సినిమా రిలిజ్ కు సంబంధించి ఫ్యాన్స్ కు షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. కెనడాలోని ప్రముఖ పంపిణీ సంస్థ యార్క్ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా జననాయగన్ విడుదల ఏకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు వాయిదా పడినట్లు వెల్లడించింది. సెన్సార్ బోర్డుతో కొనసాగుతున్న న్యాయపోరాటం కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం, ఫిబ్రవరిలో విడుదలవుతుందని అంతా భావించారు. అయితే, యార్క్ సినిమాస్ తన తాజా ప్రకటనలో, “ప్రియమైన ప్రేక్షకులారా, ‘జననాయగన్’ సినిమా ఏప్రిల్ 30వ తేదీ లోపు విడుదల కాదని గమనించగలరు. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తమ రిఫండ్ కోసం థియేటర్లను సంప్రదించవచ్చు” అని పేర్కొంది. దీనిని బట్టి ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ చివరలో లేదా మే నెలలో వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రకటనతో ఒక విషయం స్పష్టమైంది. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు. విజయ్ తన సొంత పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) స్థాపించిన తర్వాత వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో, ఈ చిత్రం ఎన్నికల ప్రచారానికి ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ సెన్సార్ చిక్కులు, కోర్టు వివాదాల వల్ల ఈ సినిమా ఎన్నికల తర్వాతే విడుదల కానుంది. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమాను ఇప్పటికే రివైజింగ్ కమిటీకి పంపారు. అక్కడ క్లియరెన్స్ వస్తేనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కెనడా డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా విజయ్‌ని వెండితెరపై ఆఖరిసారిగా చూడాలనుకుంటున్న అభిమానులకు ఈ నిరీక్షణ మరికొంత కాలం తప్పేలా లేదు.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?