Indian Army Jawan: పెట్రోలింగ్‌లో ఉండగా హిమపాతంలో తప్పిపోయిన ఆర్మీ జవాన్ మృతదేహం 38 ఏళ్ల తర్వాత సియాచిన్‌లోని పాత బంకర్‌లో లభ్యమైంది. ఆదివారం రాణిఖేట్‌లోని సైనిక్ గ్రూప్ సెంటర్ మృతదేహాన్ని 19 కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్ హర్బోలాగా గుర్తించారు. సియాచిన్ వద్ద హిమాలయాల్లో ఓ మంచుదిబ్బ వద్ద రెండు మృతదేహాల్ని జవాన్లు కనుగొన్నారు. అక్కడే లభించిన ఐడెంటిఫికేషన్ డిస్క్‌పై ఉన్న సంఖ్య ఆధారంగా ఆ అమర సైనికుడిని లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌గా గుర్తించింది రాణిఖేట్‌లోని సైనిక్ గ్రూప్ సెంటర్.
హర్బోలా 1984లో పాకిస్థాన్‌తో పోరాడేందుకు ‘ఆపరేషన్ మేఘదూత్’ కోసం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధభూమికి పంపబడిన 20-సభ్యుల దళంలో ఆయన పనిచేశారు. పెట్రోలింగ్ సమయంలో వారు మంచు తుఫానులో చిక్కుకున్నారు. మే 29వ తేదీన ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. చంద్రశేఖర్ సహా మొత్తం 20 మందిని మంచు రక్కసి మింగేసింది. అందులో 15 మంది సైనికుల మృతదేహాలను స్వాధీనం లభ్యం కాగా, మిగిలిన ఐదుగురి మృతదేహాలు కనుగొనబడలేదు. వారిలో హర్బోలా ఒకరు. 19 కుమావోన్ రెజిమెంట్‌లో సభ్యుడైన చంద్రశేఖర్ హర్బోలా స్వస్థలం ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని ద్వారాహట్. 1975లో సైన్యంలో చేరారు. లాన్స్ నాయక్ హోదాలో భారత సైన్యంలో పని చేశారు. అల్మోరాకు చెందిన అతని భార్య శాంతి దేవి ప్రస్తుతం ఇక్కడి సరస్వతి విహార్ కాలనీలో నివసిస్తున్నారు. హర్బోలా ఇంటికి చేరుకున్న హల్ద్వానీ సబ్ కలెక్టర్ మనీష్ కుమార్, తహసీల్దార్ సంజయ్ కుమార్ పూర్తి సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!
38 ఏళ్ల క్రితం ఆయన భార్య శాంతి దేవి మాట్లాడుతూ.. తమకు పెళ్లయి తొమ్మిదేళ్లు అయ్యిందని, అప్పుడు ఆమె వయసు 28. ఆ సమయంలో వారి పెద్ద కుమార్తెకు నాలుగు సంవత్సరాలు, చిన్న కుమార్తెకు ఒకటిన్నర సంవత్సరాలు. హర్బోలా చివరిసారిగా జనవరి 1984లో ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో అతను త్వరలో తిరిగి వస్తానని హామీ ఇచ్చాడని శాంతి దేవి చెప్పారు. అయితే, శాంతి దేవి తన భర్త కుటుంబానికి చేసిన వాగ్దానాల కంటే దేశం కోసం తన సేవకు ప్రాధాన్యతనిచ్చినందుకు గర్వంగా ఉందని అన్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అల్మోరాలోని ద్వారహత్ నివాసి అయిన హర్బోలా 1975లో సైన్యంలో చేరాడు. మరో సైనికుడి మృతదేహం కూడా కనుగొనబడింది, అయితే అతని గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదు.