EX MLA Arrest: దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన బిహార్ మాజీ శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) రంజన్ తివారీని గురువారం భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలోని రాక్సాల్‌లో అరెస్టు చేశారు. పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపినందుకు ఉత్తరప్రదేశ్ (యూపీ) పోలీసులు ఆయన పట్టిస్తే రూ.25 వేల నజరానాను కూడా ప్రకటించారు. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్, బిహార్ పోలీసు బలగాల సంయుక్త బృందం అతడిని పట్టుకుంది.
“బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలోని గోవింద్‌గంజ్ అసెంబ్లీ స్థానానికి చెందిన మాజీ ఎమ్మెల్యే 1998లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతను దాదాపు రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్నాడు” అని తూర్పు చంపారన్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆశిష్ కుమార్ వెల్లడించారు.
Vijayvargiya: ‘నితీష్.. బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చుకునే విదేశీ మహిళల లాంటి వాడు’
ప్రాథమిక లాంఛనాలు పూర్తయిన తర్వాత తదుపరి విచారణ నిమిత్తం అతడిని యూపీ పోలీసులకు అప్పగించామని, బిహార్‌లో అతనిపై నమోదైన కేసులను కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. తివారీ రక్సాల్ మీదుగా ఖాట్మండుకు పారిపోవాలని యోచిస్తున్నట్లు రక్సాల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ చంద్ర ప్రకాష్ తెలిపారు.