Corona Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం 12,608 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 15,754 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తాజాగా 47 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 15,220 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.58 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతానికి పెరిగింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు దేశంలో 4,54,491మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Indian Employees: బాస్‌లు అలెర్ట్.. ఉద్యోగులు ఎప్పుడైనా షాక్ ఇవ్వొచ్చు…! తాజా సర్వే
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 527253 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 101830 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 43685535 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో31,52,882 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 209.27 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 430,588 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మరో 551 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.