తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అని ఆయన అన్నారు. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్‌బాబు పేర్కొన్నారు.
సెప్టెంబరు 27, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్న దేవర చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయడానికి జాన్వీ కపూర్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మరో చిత్రంలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ సంతకం చేసింది. జాన్వీ కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో ఒక చిన్న అతిధి పాత్రలో నటించేందుకు సంతకం చేసింది.
యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ఏఎస్ రిగ్వేద చౌదరి సమర్పణలో ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కార్తీక్ రెడ్డి రాకాసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'FLASH BACK' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు.
కృతి శెట్టి టాలీవుడ్‌లో 'ఉప్పెన' రూపంలో భారీ బ్లాక్‌బస్టర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ''ఉప్పెన'' ఘనవిజయంతో కృతికి టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి, అయితే ఇటీవల ఆమె నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చాలా మంది యువ కథానాయికను అన్‌లక్కీ అంటూ ముద్ర వేశారు. కానీ నటి ఇప్పుడు సాలిడ్ హిట్‌తో తిరిగి వచ్చింది.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రాబోయే చిత్రం 'రాజాసాబ్'లో విభిన్నమైన శైలిలో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధంగా ఉన్నాడు. 400 కోట్ల బడ్జెట్‌తో రొమాంటిక్ హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్.. నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యంను కలిశారు. ఉత్పాదక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతితో పాటు విజన్ 2047తో పాటు రానున్న ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై చర్చించారు.
తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగం ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అలర్ట్ అయింది. ఏపీ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలనూ దేవాదాయ శాఖ సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది.