Tirmala Laddu Row: తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగం ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అలర్ట్ అయింది. ఏపీ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలనూ దేవాదాయ శాఖ సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. ఆవు నెయ్యిని ఏయే కంపెనీల నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు..? ధరల వివరాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యిని విజయ, విశాఖ వంటి డెయిరీల్లోనే కొనుగోలు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ వివరాల సేకరణలో వెల్లడైంది. ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోళ్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధి విధానాలను ఖరారు చేసే యోచనలో దేవాదాయ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో జరిగిన తప్పిదాలు.. మిగిలిన దేవాలయాల్లో జరగకుండా దేవాదాయ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.
Read Also: Pawan Kalyan: పటిష్టంగా గ్రామీణ రహదారులు.. ఏఐఐబీ బ్యాంకు సహాయంతో పల్లెల్లో పక్కా రోడ్లు