చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని విమర్శించారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు.
టీటీడీ లడ్డూ ప్రసాదం మీద ఆరోపణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దాడులు చేయటం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రత్యేకించి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పర్సనల్‌గా తీసుకున్నారట. అక్కడున్న సీనియర్ లీడర్‌కు గట్టి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట. ఇంతకీ ఆ సీటు విషయంలో కేసీఆర్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? ఆయన కత్తులు నూరుతున్న ఆ సీనియర్ ఎవరు?
తిరుమల శ్రీవారికి మహా భక్తురాలు ఆ మాజీ మంత్రి. అది ఎంతలా అంటే... సాధారణ భక్తులు ఎవ్వరికీ వీలవని విధంగా వారానికోసారి, కుదిరితే రెండు సార్లు కొండెక్కి దర్శనం చేసుకునేంత. మరి అంతటి భక్తి ఉన్న నాయకురాలు శ్రీవారి మహా ప్రసాదం లడ్డూపై ఇంతటి వివాదం జరుగుతున్నా.. ఎందుకు మాట్లాడటం లేదు? అసలా విషయమే తెలియదన్నట్టుగా కామైపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏమా భక్తిరస కథాచిత్రమ్?
గులాబీ పార్టీ ట్రాక్ అండ్ ట్రెండ్ మార్చాలనుకుంటోందా? పోగొట్టుకున్న చోటే వెదుక్కునే ప్లాన్‌కు పదును పెడుతోందా? అటు సీనియర్స్‌ని సంతృప్తి పరచడం, ఇటు పార్టీ అవసరాలు తీర్చుకోవడమన్న రెండు పిట్టల్ని ఒకే దెబ్బకు కొట్టాలనుకుంటోందా? జనంలోకి దూకుడుగా వెళ్ళడానికి బీఆర్‌ఎస్ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటి? దాని మీద పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది?
సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు.
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని ఎక్స్(ట్విట్టర్) వేదికగా పవన్ కల్యాణ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరన్నారు.
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన అందాల నటి మృణాల్ ఠాకూర్. తెలుగులోకి అడుగు పెట్టక ముందు పలు బాలీవుడ్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన గ్లామర్ షోతో పాటు అద్భుతమైన నటనతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మరో ట్రీట్ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. రిలీజ్ లోపే మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ బయటకొచ్చింది.
సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 8లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 8 ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. మొత్తం 4 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. మొదటివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.