గుంటూరు జిల్లాలో రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గుంజి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి మోసం చేశాడని భాదితులు ఫిర్యాదు చేశారు. పదిమంది వద్ద సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడని చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చాయి.
ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నదిలో ఇప్పటికే మూడు బోట్లను తొలగించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నీటి అడుగున మరో రెండు బోట్లు ఏమైనా ఉన్నాయేమోనని గాలింపు చేపడుతున్నామన్నారు.
శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ వున్న అంశం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. కల్తీ వస్తువులను అరికట్టడానికి టీటీడీ చర్యలు ప్రారంభించిందన్నారు.
CM Chandrababu: తిరుమలలో జరిగిన అపచారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొ్న్నారు. అపచారం ఎవరి వల్ల జరిగింది..? ఎందుకు జరిగిందనే అంశంపై విచారణ చేసి సిట్ నివేదిక ఇస్తుందన్నారు. టీటీడీలో జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా రేపు హోమం చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో.అక్కడి సంప్రదాయం ప్రకారం శుద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. Read Also: AP CM […]
ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పాలకులెవ్వరూ తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదన్నారు. ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని.. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామన్నారు.
ఈనెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు.
అల్లూరి జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.
కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ.. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. గత పాలక మండలి హయాంలో తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై వివరాలు తెలియజేశారు.