Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రివేళ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, బేగంపేట్, అబిడ్స్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాగోల్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, అంబర్‌పేట్, రామంతపూర్, గోల్నాక, నారాయణగూడ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Also: Telangana Cabinet: హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలివే..