ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ టీటీడీ ఈవో శ్వామలరావు ఆ వివాదంపై స్పందించారు. తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో చిట్టీల వ్యాపారంతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగిత శివకుమార్ అనే వ్యక్తి గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
యువగళం పాదయాత్రలో ఇచ్చిన తోలి హామీ అమలు చేశారు మంత్రి నారా లోకేష్. ఇచ్చినా హామీ మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసినా లోకేష్ స్వయంగా రేపు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు.
పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. తిరుపతి జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న అమ్మాయిలపై అసభ్య ప్రవర్తించిన ఈ ఘటన రేణిగుంట మండలం ఆర్ మల్లవరం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు రవిపై విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు.
నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం బంగారక్కపాలెంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. రామకృష్ణ అనే యువకుడు ఉద్యోగం చేస్తున్న రమ్య అనే యువతిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలిసింది. అమ్మపాలెం గ్రామానికి చెందిన రమ్య వెంట తనను ప్రేమించాలని ఎంతో కాలంగా వేధిస్తున్నట్లు సమాచారం.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. భక్తుల కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జితసేవల, దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.