Viral Video: లైకులు, కామెంట్ల కోసం కొందరు ఎన్ని విన్యాసాలు అయినా చేస్తారు. అలాంటి విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు దొరుకుతాయి. కొందరు స్టంట్స్ చేయబోయి అడ్డంగా బుక్కయిపోవడం కూడా చూశాం. కొందరు స్టంట్స్‌ను అదరగొట్టేస్తారు. మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు అంటూ స్టంట్స్ అంటూ చేసి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తాజాగా ఇన్‌స్టా రీల్స్ క్రేజ్‌తో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన హన్మకొండ జిల్లా ఖాజీపేటలో చోటుచేసుకుంది.
ఖాజీపేట నుంచి మంచిర్యాల వెళ్లే రైలు మార్గంలో రైలు వస్తుండగా ఓ యువకుడు ఇన్‌స్టా రీల్ చేయబోయి ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన వడ్డేపల్లి ట్రాక్ వద్ద జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వడ్డేపల్లికి చెందిన అక్షయ్ రాజు ఆదివారం కాలేజ్‌కు సెలవు కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి ఇన్‌స్టా రీల్స్ చేద్దామని ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్ పక్కన వీడియో చేస్తుండగా ఖాజీపేట నుంచి మంచిర్యాల వెళ్లే రైలు అక్షయ్‌ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో స్నేహితులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి కాలు, తలకు దెబ్బలు తాకడంతో చికిత్స పొందుతున్నాడు.
Arvind kejriwal: భగవద్గీత శ్లోకాన్ని తప్పుగా చదివిన కేజ్రీవాల్.. వీడియో వైరల్
సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయ్యేందుకు కొందరు చేస్తున్న పనులు కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని చూస్తున్నా.. అలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇన్‌స్టా, మోజ్ వంటి వాటిల్లో లైకులు, ఫాలోవర్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇందుకోసం కొందరు ప్రాంక్ వీడియోల పేరిట జనాల ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు కదులుతున్న రైలు, బైకులపై సెల్ఫీలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యువకులు అనవసరంగా లైకుల కోసం, ఫాలోవర్ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.