Arvind kejriwal: గుజరాత్ పర్యటనలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భగవద్గీతలోని శ్లోకాన్ని తప్పుగా పలికిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించిన కేజ్రీవాల్ ఈ సూచన చేశారు. గుజరాత్ లో ఎలాగైనా పట్టు సాధించాలన్న ఉద్దేశంతో అరవింద్ కేజ్రీవాల్ విస్తృతంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సూరత్‌లోని ద్వారకాదీష్ ఆలయం వెలుపల విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఢిల్లీ ముఖ్యమంత్రి సంస్కృతంలో తన సొంత శ్లోకాన్ని (పద్యాన్ని) రూపొందించారు. ఈ సందర్భంగా తన పార్టీ గుర్తు చీపురును గుర్తు చేస్తూ.. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరుగుతోంది.
భగవద్గీతలోని “యదా యదా హి ధర్మస్య” అనే శ్లోకాన్ని ప్రస్తావిస్తూ దానికి బదులుగా “యదా యదా హి ధజ్” అని అన్నారు. అనంతరం కేజ్రీవాల్ ఈ పద్యం గురించి వివరించారు. భూమిపై చెడు పెచ్చరిల్లినప్పుడల్లా భగవంతుడు తన చీపురుకు పని చెప్పాల్సి వస్తుండంటూ.. తమ పార్టీ గుజరాత్‌లో చెడును ఊడ్చేసేందుకు వచ్చిందన్నట్టుగా కేజ్రీవాల్ మాట్లాడారు. అయితే శ్లోకాన్ని కేజ్రీవాల్ తప్పుగా పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆప్ ఇంకా స్పందించలేదు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. కేజ్రీవాల్ పవిత్ర గ్రంథంలోని తప్పుడు పద్యం ఉపయోగించారని నెటిజన్లు వెంటనే ఎత్తిచూపారు. విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు, అభిమానుల నుంచి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
Ghulam Nabi Azad: కాంగ్రెస్ మా రక్తంతో తయారైంది.. కంప్యూటర్లు, ట్విట్టర్లతో కాదు..
‘‘ఎవరు వీరంతా.. ఎక్కడి నుంచి వస్తారు ఇలాంటి వారు’, ‘ఇలా శ్లోకం ఎవరు చెప్పారు? ఈయనకు ఎప్పుడు చెప్పారు..?’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. “గీతలోని ఏ అధ్యాయంలో భగవంతుడు ఇలా చెప్పాడు..? మరి ఈ దేవుడు చీపురు గురించి ఏ పుస్తకంలో చదివాడు? నిజంగా ఇలాంటి వ్యక్తులు ఈ భూమిపై చాలా అరుదుగా కనిపిస్తారు” అని మరొకరు ట్వీట్ చేశారు. ‘కేజ్రీవాల్‌కు శ్లోకాలు తెలియకపోతే.. వాటిని పఠించకుంటే బాగుంటుంది. ధర్మాన్ని నిలబెట్టేందుకు భగవంతుడి చేతిలో పెట్టుకున్న సుదర్శన చక్రాన్ని.. చీపురు కట్టతో పోల్చవద్దు. ఆ దేవుడు మీకు కనీస జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం..” అంటూ పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. కేజ్రీవాల్ శుక్ర, శనివారాల్లో గుజరాత్‌లో పర్యటించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సవాల్ విసిరేందుకు ఆయన సర్వత్రా ప్రచారం చేస్తున్నారు. శనివారం ఢిల్లీ సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఓడిపోతామన్న బెంగ బీజేపీలో ఉందన్నారు. ఇటీవల ఆప్ నాయకుడిపై దాడి చేయడంతో ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. ఆప్ గుజరాత్‌లో 12 సీట్లను గెలుచుకుంటుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
"यदा यदा ही — धज्ज ".??
🤔
वाकई में इस तर के धुर्त इस धरा पर यदा कदा ही प्रकट होते हैं । pic.twitter.com/JrQvKx1m99— शशांक शेखर मिश्र (@panditji2590) September 3, 2022