Cyrus Mistry Passes away: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందారు. ముంబైలో రోడ్డుప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సూర్య నది చరోటి వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మిస్త్రీ తన మెర్సిడెస్ కారులో గుజరాత్ నుంచి ముంబైకి తిరిగి వస్తున్నారు. కారు డివైడర్‌ను వేగంగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా స్పాట్లోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. అతనితో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయని, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని పాల్ఘర్ ఎస్పీ ధ్రువీకరించారు.
మిస్త్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖాసా రూరల్ ఆస్పత్రికి తరలించారు. మిస్త్రీ మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. మిస్త్రీ అకాల మరణం షాకింగ్‌కు గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ వ్యాపార పరిశ్రమకు తీరని లోటు అని ట్వీట్ చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు మిస్త్రీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వార్త తనను ఎంతో కలచివేసిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
జులై 4స 1968లో జన్మించిన మిస్త్రీ యూకేలోని ఇంపీరియల్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్, లండన్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్సీని చేశారు. 2006 నుంచి టాటా సన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన, ఆయన నవంబర్ 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించారు.
Viral Video: యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ క్రేజ్..
సైరస్ మిస్త్రీ ఎవరు?: టాటా సన్స్‌కు ఆరో ఛైర్మన్‌గా ఉన్న మిస్త్రీని అక్టోబర్ 2016లో పదవి నుంచి తొలగించారు. రతన్ టాటా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2012 డిసెంబర్‌లో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్ చంద్రశేఖరన్ తర్వాత టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2021లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వేసిన పిటిషన్‌ను మేలో సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Former Chairman of Tata Sons Cyrus Mistry died in a car crash at around 3pm in Maharashtra's Palghar area. A total of 4 people were there in the vehicle; two, including Cyrus Mistry, died: Palghar Police pic.twitter.com/7sE8PgPUno
— ANI (@ANI) September 4, 2022