Rajastan: కని, పెంచి, పెద్దచేసిన తల్లిని… కర్కశంగా ప్రాణాలు తీశాడో కుమారుడు. నవమాసాలు మోసి సాధిన కొడుకే తన పాలిట యముడవుతాడని ఆ తల్లి ఊహించలేకపోయింది. ఓ కసాయి కొడుకు మేక కోసం కన్నతల్లినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్‌లో చోటు చేసుకుంది. సునేల్ పీఎస్ పరిధిలోని సేమ్లియా గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలిని నోదయన్‌బాయి మేఘవాల్(40)గా పోలీసులు గుర్తించారు. 12వ తరగతి చదువుతున్న నిందితుడు మేకను అమ్మేసిందన్న కోపంతో తల్లిని చంపేశాడు. అనంతరం తల్లి మృతదేహాన్ని చుట్టేసి ఇంట్లోని పెద్ద డబ్బాలో దాచిపెట్టాడు.
Robbery: రూ.6కోట్ల విలువైన నగలు దోచారు… రూ.100 పేటీఎం చేసి దొరికిపోయారు..!
పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న భర్త.. భార్య గురించి ఆరా తీశాడు. పొలానికి వెళ్లిందని కొడుకు అబద్ధం చెప్పాడు. స్థానికులంతా కలిసి ఆమె కోసం వెతికినా ఆచూకీ కనిపించకపోవడంతో ఆ బాలుడిని తండ్రి గట్టిగా అడిగాడు. దాంతో ఆ బాలుడు చేసిన దారుణాన్ని ఒప్పుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.