లంకలో అత్యంత తీవ్ర ఆర్థక సంక్షోభానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ప్రజాగ్రహానికి గురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం ద్వీపదేశంలో అడుగుపెట్టారు.
షార్జాలో శుక్రవారం జరిగిన ఆసియా కప్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో హాంకాంగ్‌పై రికార్డు స్థాయిలో 155 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్థి భారత్‌పై మరోసారి తలపడనుంది.
రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత్.. ఇవాళ మరో మైలురాయిని అందుకుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
అధిక జనాభా సమస్యను నియంత్రించేందుకు నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఏకంగా ఓ గర్భిణికి నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తిసి ఆ శిశువు పూర్తిగా వృద్ధి చెందలేని తెలిసి తిరిగి కడుపులో పెట్టి కుట్టేసిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది.
జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా శుక్రవారం నాడు 800 విమానాలను ప్యాసింజర్, కార్గో విమానాలను రద్దు చేసింది. పైలట్ల సమ్మె కారణంగా ఈ రోజు ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ విమానాశ్రయాలకు వెళ్లే, బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ఇది 130,000 మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతుందని గురువారం లుఫ్తాన్సా గ్రూప్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో ఘాజీపూర్ జిల్లాలోని రేవతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అథోటా గ్రామంలో బుధవారం 17 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు.