Corona cases in india: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,093మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు బాగా పెరిగింది. 98.7 శాతం రికవరీలు పెరిగాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 49,636 కు పడిపోయింది. మొత్తం కేసులో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 0.11 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.88 శాతంగా ఉంది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో మొత్తంగా 4,44,72,241 కరోనా కేసులు నమోదు అవ్వగా.. వీరిలో 5,28,121 చనిపోగా… 4,39,06,972 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారికి 214.55 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 28,09,189 కరోనా వ్యాక్సినేషన్ అందించారు. 3,16,504 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇక ప్రపంచంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 4,94,915 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,587 మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియాల్లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. రోజుకు అక్కడ లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 61,24,42,0977 కేసులు నమోదు కాగా.. వీరిలో 65,12,111 మంది మరణించారు. 59,02,36,549 మంది కోలుకున్నారు.
India: నూకల ఎగుమతిపై తక్షణ నిషేధం విధించిన భారత్
జపాన్‌లో కొత్తగా 1,26,487 కేసులు వెలుగుచూశాయి. మరో 265 మంది మరణించారు.దక్షిణ కొరియాలో 72,599 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 64 మంది మృతి చెందారు. రష్యాలో 47,958 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 93 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 46,661 కొవిడ్ కేసులు నమోదు కాగా, 287 మంది మరణించారు. జర్మనీలో 35,995 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 119 మంది ప్రాణాలు కోల్పోయారు.