IND vs AFG: మూడేళ్ల తర్వాత సెంచరీ బాదిన కోహ్లీ.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం.. దాదాపు వెయ్యి రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో గురువారం అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లీ తన టీ-20 కెరీర్‌లో అత్యధిక పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో నెట్టింట కోహ్లీ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు 119 పరుగులతో టాప్ స్కోరర్‌గా రోహిత్ ఉండగా… ఆఫ్ఘన్‌పై 122 పరుగుల చేసి విరాట్ రోహిత్‌ను వెనక్కి నెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో తన ఆటతో కోహ్లీ హైలెట్‌గా నిలిచాడు. మైదానంలో అన్ని వైపులకు బంతిని పరుగులు తీయించిన కోహ్లీ ఓవరాల్ గా 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ, ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (71)తో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. అంతేకాదు, అంతర్జాతీయ టీ20 పోటీల్లో కోహ్లీకిదే తొలి సెంచరీ. దాంతోపాటే, భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్ మన్‌గానూ అవతరించాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
Asia Cup 2022: ఆసియా కప్ జట్టులో అవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహర్
విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ తర్వాత టీమ్ ఇండియా తమ బ్యాటింగ్ ప్రస్థానాన్ని 212/2 వద్ద ముగించింది. కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులు చేయగా, పంత్ 16 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు 20.0 ఓవర్లలో 213 పరుగులు చేయాలి. అంతకుముందు, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరిగిన ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి, కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?