Neeraj Chopra: చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeraj Chopra: స్టార్ ఇండియన్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా గురువారం మరో చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత తొలి క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. అగ్రశ్రేణి అథ్లెటిక్స్ పోటీలో 88.44 అత్యుత్తమ త్రోను సాధించి విజేతగా నిలిచాడు. ఈ ట్రోఫీని సాధించడం తన కెరీర్‌లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో చోప్రా స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ప్రపంచంలోని ఆరుగురు మేటి జావెలిన్ త్రోయర్లు పోటీ పడ్డ తుది పోరులో నీరజ్ తన బల్లెంను అత్యధికంగా 88.44 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. తన రెండవ ప్రయత్నంలోనే చోప్రా అందరికంటే ఎక్కువ దూరం విసిరి స్వర్ణం సాధించడం విశేషం.
నీరజ్ చోప్రా తన మొదటి ప్రయత్నంలో ‘నో త్రో’గా ప్రకటించబడినందున అతనికి మంచి ప్రారంభం లభించలేదు. కాగా, జాకుబ్ వడ్లెజ్ 84.15 మీటర్ల త్రోతో ముందంజ వేశాడు. నీరజ్ తన రెండవ ప్రయత్నంలో 88.44 మీటర్ల అద్భుతమైన త్రోతో తిరిగి పోటీలోకి ప్రవేశించాడు. అది అతన్ని టేబుల్‌పై అగ్రస్థానానికి నెట్టివేసింది. వడ్లెజ్చ్ 86.00 మీటర్ల త్రోతో అతనిని వెంబడించాడు. నాలుగో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 86.11 మీటర్ల దూరం విసిరాడు. నాల్గవ ప్రయత్నం ముగిసే సమయానికి, నీరజ్ ఆధిక్యంలో ఉన్నాడు, వాడ్లెజ్చ్ అతని నాల్గవ ప్రయత్నంలో 86.94 మీటర్ల త్రోతో అతనికి అత్యంత సమీప ఛాలెంజర్‌గా నిలిచాడు.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
IND vs AFG: ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. విరాట్ వీరవిహారం.. బౌలింగ్‌లో భువి అదుర్స్
గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరంగా ఉన్న నీరజ్.. నెలన్నర విరామం తర్వాత జులై చివర్లో లాసానె డైమండ్ లీగ్‌లో విజేతగా నిలిచి ఫైనల్స్ కు అర్హత సాధించాడు. ఈ ఈవెంట్‌లో అతని అత్యుత్తమ త్రోతో, చోప్రా లాసాన్‌లో విజయంతో ప్రతిష్టాత్మకమైన డైమండ్ లీగ్ మీటింగ్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు అయ్యాడు. ఈ విజయం తర్వాత నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో అతను పోటీ పడటం ఇది మూడోసారి. గతంలో 2017, 2018 ఎడిషన్స్‌లో ఫైనల్స్ ఆడినా… వరుసగా ఏడు, నాలుగో స్థానాలతో సరిపెట్టాడు. ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగొచ్చాడు.
అథ్లెటిక్స్ లో ప్రపంచ చాంపియన్ షిప్స్, ఒలింపిక్స్ తర్వాత డైమండ్ లీగ్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పరిగణిస్తారు. ఇందులో మొత్తం 32 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో 13 సిరీస్ ల్లో ప్రదర్శన ద్వారా అథ్లెట్లు.. ఫైనల్ ఈవెంట్ కు అర్హత సాధిస్తారు. ప్రతి కేటగిరీలో ఫైనల్లో నెగ్గిన విన్నర్‌ను డైమండ్ లీగ్ ఛాంపియన్ గా పిలుస్తారు. ప్రతి కేటగిరీలో విజేతకు సుమారు 24 లక్షల ప్రైజ్ మనీతో పాటు 2023 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు. భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా ఇవన్నీ సాధించాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు