Karnataka: మందుకొట్టి పిల్లలకు పంతులమ్మ పాఠాలు.. దొరికిపోవడంతో సూసైడ్ చేసుకుంటానని బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దాదాపు 25 ఏళ్లుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. తన జీవితంలో వేలాదిమందికి విద్యాబుద్ధులు నేర్పారు. కానీ ఐదేళ్ల క్రితం ఏమైందో ఏమో.. మద్యానికి అలవాటు పడ్డారు. అక్కడితో ఆగకుండా.. నేరుగా పాఠశాలకే మద్యం బాటిళ్లు తీసుకొచ్చి తాగి పాఠాలు చెప్పేవారు. నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను కారణం లేకుండానే కొట్టడం, తిట్టడం, సహ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మకు ఎన్నిసార్లు తప్పును సరిదిద్దుకోవాలని హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరికి తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి ఉపాధ్యాయురాలికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అయినా ఆమె తీరు మారలేదు. చివరికి అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయి సస్పెండయ్యారు.
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగి అవినీతి సమాజానికి చేసిన నేరమే..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఆమె పేరు గంగలక్ష్మమ్మ. కర్ణాటకలోని తుముకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఆమె మద్యం తాగి స్కూలుకు రావడం, విద్యార్థులను చితకబాదుతుండడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు తాజాగా స్కూలుకు చేరుకుని పాఠశాలకు తాళం వేశారు. ఆపై టీచర్ గంగలక్ష్మమ్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసిన తాలూకా విద్యాధికారి (బీఈవో) హనుమానాయక్‌కు గ్రామస్థులు పరిస్థితిని వివరించారు. దీంతో స్కూలు లోపలికి వెళ్లి ఉపాధ్యాయిని టేబల్ డ్రా తెరిచేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు. గ్రామస్థులు టేబుల్ డ్రాకు ఉన్న తాళాలు పగలగొట్టి చూడగా అందులో ఓ మద్యం సీసా, మరో రెండు ఖాళీ సీసాలు లభించాయి. ఈ పరిణామంతో గంగలక్ష్మమ్మ తీవ్ర ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి తాళాలు వేసుకుని ఆత్మహత్య చేసుకొంటానని హంగామా సృష్టించారు. అనంతరం పోలీసులు అక్కడికి వచ్చి మద్యం సీసాలను జప్తు చేశారు. ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!