Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లతో ప్రతికూల సంకేతాల కారణంగా మార్కెట్లు నేడు కుదేలయ్యాయి. రోజంతా ఇదే ధోరణి కొనసాగింది. శుక్రవారం సెన్సెక్స్ 1021 పాయింట్లు నష్టపోయి.. 58,099కు పతనమైంది. నిఫ్టీ 302 పాయింట్లు తగ్గి 17,327కు దిగజారింది. ఫలితంగా.. రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఇతర ఆసియా మార్కెట్లూ ఇదే తరహాలో నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందనే భయాందోళనలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయి.
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో పవర్ గ్రిడ్ 7.93 శాతం పడిపోయింది. మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టిపిసి, హెచ్‌డిఎఫ్‌సి మరియు ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్, ఐటీసీ మాత్రమే లాభపడ్డాయి. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.
Death Certificate: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. వైరల్ అవుతున్న పేపర్ ప్రకటన
ద్రవ్యోల్బణం పెరుగుదల, మాంద్యం భయాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి పరిణామాల మధ్య అమెరికన్ డాలర్ క్రమంగా బలపడుతోంది. ఇతర కరెన్సీలన్నీ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండగా.. మదుపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. అమెరికన్ విపణుల్లో పెట్టుబడులే మేలనే అభిప్రాయంతో ఉన్నారు. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.శుక్రవారం ఉదయం 59,005 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. మొదట్లో స్వల్పంగా పెరిగి 59,143 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. తర్వాత కాసేపటికే నష్టాల బాట పట్టింది. అటు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 81.04 వద్ద ముగిసింది.