AIIMS-Delhi: ఎయిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIIMS-Delhi: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ ఎం శ్రీనివాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ శుక్రవారం నియమించింది. దిల్లీ ఎయిమ్స్ ప్రస్తుత డైరెక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో హైదరాబాద్ ఈఎస్‌ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ డీన్ శ్రీనివాస్‌ను నియమించారు. సెప్టెంబరు 23 నాటి అధికారిక ఉత్తర్వుల ప్రకారం, శ్రీనివాస్‌ను ఐదేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఈ స్థానంలో సేవలందించనున్నారు.
Uttarakhand: రిసార్ట్‌లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
Also Read
- రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
డాక్టర్ గులేరియా మార్చి 28, 2017న డైరెక్టర్‌గా చేరారు. నేటితో ఆయన పదవీకాలంలో ముగియనుండడంతో శ్రీనివాస్‌ను ఈ స్థానానికి ఎంపిక చేశారు. శనివారం శ్రీనివాస్ ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. . తొలుత ఈ పదవికి పలువురి పేర్లు వినిపించినా.. ఇటీవల డాక్టర్ శ్రీనివాస్ పేరును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఎంపిక/శోధన కమిటీ సిఫార్సు చేసింది. ఆయనతో పాటు తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ బిహారీ పేరునూ కమిటీ ప్రతిపాదించింది. మార్చిలో, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ ప్రమోద్ గార్గ్, ఎండోక్రినాలజీ విభాగం అధిపతి డాక్టర్ నిఖిల్ టాండన్, ఎయిమ్స్ ట్రామా సెంటర్ చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రాతో సహా ముగ్గురు వైద్యుల పేర్లు వచ్చాయి. చివరికి డాక్టర్ శ్రీనివాస్‌ను నియమిస్తూ కేంద్ర నియామక, శిక్షణ విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!