Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. దీనికోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్‌లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా నివేదికలు తెలిపాయి. ఈ ఖర్చు క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల కంటే చాలా ఎక్కువని పేర్కొన్నాయి. ఎలిజబెత్ అంత్యక్రియలకు దాదాపు 1.3 బిలియన్ల యెన్‌లు ఖర్చుచేసినట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు ఎక్కువ ఖర్చు చేయడాన్ని దేశ ప్రజలు ప్రశ్నిస్తు్న్నారు. ఈ ఏడాది జూలైలో షింజో అబే హత్యకు గురైన సంగతి తెలిసిందే.
షింజో అబే సంస్మరణ సభ నిర్వహించే కాంట్రాక్ట్ టోక్యోకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ మురయామాకు ఇవ్వబడింది. ప్రభుత్వం ఎందుకు అంత ఖర్చు చేస్తోందంటూ ఈ కార్యక్రమాన్ని చాలా మంది జపనీయులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభపై నిరసన తెలుపుతూ ప్రధాని ఫుమియో కిషిడా కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్నాడు. ది గార్డియన్ నివేదిక ప్రకారం, జపాన్ ప్రభుత్వం రాష్ట్ర అంత్యక్రియల అంచనా వ్యయం 250 మిలియన్ యెన్‌లుగా పేర్కొంది. క్యాబినెట్ చీఫ్ సెక్రటరీ హిరోకాజు మాట్సునో ప్రకారం, ఈవెంట్పోలీసింగ్ కోసం దాదాపు 800 మిలియన్ యెన్‌లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా, ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడానికి 600 మిలియన్ యెన్‌లు ఖర్చవుతాయని అంచనా. ఈ బిల్లు మొత్తంగా 1.7 బిలియన్ యెన్‌లకు చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు. గతంలో టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ 13 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఈవెంట్ కోసం అంచనా వేసిన బడ్జెట్ కంటే దాదాపు రెట్టింపు.
Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో శశిథరూర్.. ఆ ఇద్దరి మధ్యే పోటీ!
జపాన్ ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన షింజో అబే జులైలో హత్యకు గురయ్యారు. నరా నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీనితో అబే వేదికపైనే కుప్పకూలారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 27న అధికారిక వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.