Assembly Video: అసెంబ్లీలో పాడుపని చేస్తూ.. అడ్డంగా బుక్కయ్యారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly Video: అసెంబ్లీ అనేది దేవాలయం వంటిది. అక్కడ రాష్ట్రంలోని ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు చర్చలు జరుపతుంటారు. ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తడం.. అధికారపక్షం వాటిని తీర్చడం.. ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేయడం.. చట్టాలు రూపొందించడం అన్ని వాటిల్లోనే జరుగుతుంటాయి. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. సభలో కూర్చుని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు పాడు పనులు చేస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించమని ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన పని సభ్య సమాజం తలపంచుకునేలా ఉంది. ఇంతకీ వారేం చేశారో తెలుసా..
Shinzo Abe: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల కంటే షింజో అబే వీడ్కోలుకు అధిక ఖర్చు.. ఎంతో తెలుసా?
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. రాష్టంలో జరుగుతున్న కొన్ని ఘటనలపై ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అయితే ఆ సమయంలో ఝాన్సీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పొగాకు నములుతూ.. మహోబా ఎమ్మెల్యే వీడియో గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో సమాజ్‌వాదీ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సదరు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఛీ..ఛీ.. అసెంబ్లీలో ఇదేం పని? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. వీరికి ప్రజా సమస్యల కంటే ఇలాంటి పనికిమాలిన పనులు బాగా ఇష్టంలా ఉందని, ఇలాంటి వారు మన ప్రజాప్రతినిధులుగా కావడం దురదృష్టం అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా దీనిపై ట్విట్టర్‌లో స్పందించారు. యూపీ విధానసభలో బీజేపీ ఎమ్మెల్యేలు పేకాట ఆడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఈ వీడియోను రికార్డు చేసి వైరల్ చేయడం ద్వారా ప్రజా ప్రయోజనాల కోసం పని చేసిన ఇతర బీజేపీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ‘ఇప్పుడు సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ ఎమ్మెల్యేపై ‘మోరల్ బుల్డోజర్’ ఎప్పుడు నడుస్తుంది? అని ప్రశ్నించారు.
— Samajwadi Party (@samajwadiparty) September 24, 2022
తాజావార్తలు
-
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
-
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
-
Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
-
Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!