Fired Bus Conductor’s Payback: ఓ కండక్టర్ తనను ఉద్యోగం నుంచి తొలగించిన యజమానిపై వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. బస్సు ఎలక్ట్రిక్ బోర్డు సెట్టింగ్‌ను మార్చేశాడు. ఆ సంస్థను తిడుతూ ఉండేలా బూతు పదాలు డిస్‌ప్లే చేశారు. ఇది చూసిన వారంతా షాకయ్యారు. దీనిని చూసిన కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
సతీష్ సుఖేజా అనే వ్యక్తి ‘సుఖేజా’ అనే పేరుతో ప్రైవేట్ బస్సు సర్వీసులు నిర్వహిస్తుండగా.. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో కండక్టర్‌ను ఉద్యోగం నుంచి తీసేశాడు. ఉద్యోగం నుంచి తొలగించిన యజమానిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఆ కండక్టర్ ఎలక్ట్రానిక్ బోర్డు డిస్‌ప్లే సెట్టింగ్‌ను మార్చేశాడు. ఆ బస్సు రూట్ గురించి తెలిపే వివరాలకు బదులుగా.. సుఖేజా సంస్థను తిడుతూ బూతు పదాలు కనిపించేలా సెట్ చేశాడు. దీనితో పాటు ఎలక్ట్రానిక్ బోర్డు పాస్‌వర్డ్‌ను కూడా మార్చేశాడు. ఆ బస్సు కండక్టర్ “మా******ద్ సుఖేజా” అని చెప్పడానికి బస్సులోని ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డుపై పదాలను సెట్టింగ్ చేశాడు.
Kishan Reddy : అధికార పార్టీ పూర్తిగా దిగజారింది.. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్య పెట్టలేరు…
కాగా మధ్యప్రదేశ్‌లోని సత్నా నుంచి ఇండోర్ మధ్య దాదాపు 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు బస్సు సిద్ధం కాగా.. డిస్‌ప్లే బోర్డుపై సత్నా-ఇండోర్ అనే పదాలకు బదులు బూతు పదాలు “మా******ద్ సుఖేజా” కనిపించాయి. ఇది చూసిన ప్రయాణికులు షాక్‌కు గురై డ్రైవర్‌కు చెప్పగా.. ఆ డిస్‌ప్లే బోర్డును ఆఫ్ చేశారు. ఈ సంఘటనపై సంస్థ మేనేజర్ స్పందించారు. తొలగించిన కండక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిస్‌ప్లే బోర్డు పాస్‌వర్డ్ కేవలం అతడికి మాత్రమే తెలుసని, ఈ పని అతడే చేసి ఉంటాడని మేనేజర్ ఆరోపించారు. కొత్త డిస్‌ప్లే బోర్డు వ్యయం రూ.55,000 ఉంటుందని, దీని కోసం రెండు రోజులు సర్వీసులు ఆపేసి ముంబైకి ఆ బస్సును పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, కొందరు ప్రయాణికులు తమ మొబైల్‌ఫోన్‌లో రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన చాలా మంది చాలా తెలివిగా ప్రతీకారం తీర్చుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది పాస్‌వర్డ్ సెట్ చేయడానికి అంత ఖర్చు ఏమి కాదని చెబుతున్నారు.
https://twitter.com/Roshan_Abbas_/status/1582803603621715968?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1582803603621715968%7Ctwgr%5E73f22f1abc370d652b000dc1a3aca9c604c7c9db%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational%2Ffired-bus-conductor-takes-revenge-with-one-last-message-for-bus-owner-808073