Dengue Patient: డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dengue Patient: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ కుటుంబం డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్‌ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని ఆరోపించింది. దీనిపై విచారణ కూడా జరుగుతున్నట్లు తెలిపింది. బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్ ఉన్నట్లు చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రాంతంలో డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా అవుతున్నట్లు వచ్చిన నివేదికలను పరిశీలించేందుకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ వెల్లడించారు.
వైరల్ అయిన వీడియోలో ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆస్పత్రిలో స్కాం జరుగుతోందని ఓ వ్యక్తి తెలిపాడు.
ప్లాస్మా అవసరమైన రోగులకు బత్తాయి జ్యూస్ సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ వీడియోలో కనిపించిన బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్‌ను పోలిన ద్రవం కనిపించింది. ఈ కారణంగానే డెంగ్యూ బారినపడిన రోగి చనిపోయాడని, ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ప్రయాగ్‌రాజ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
Exam Chit Took Boys Life: పరీక్ష చిట్టీని లవ్ లెటర్ అనుకున్న అమ్మాయి.. బాలుడి హత్య
ఈ వైరల్ వీడియోపై యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. తాము ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు. నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు, డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయబడుతుందనే నివేదికలను పరిశీలించడానికి దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడిందని ఐజీ రాకేష్ సింగ్ అన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జ్యూస్ సరఫరా చేయబడిందా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు.
प्रयागराज में मानवता शर्मसार हो गयी।
एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया।
मरीज की मौत हो गयी है।
इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP
— Vedank Singh (@VedankSingh) October 19, 2022
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?