Rishi Sunak: బ్రిటన్ ప్రధాని పదవికి అభ్యర్థిత్వం ప్రకటించిన రిషి సునాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్ పేరు బలంగా వినిపిస్తోంది. రిషికి 100 మందికి పైగా పార్టీ అభ్యర్థుల మద్ధతు లభించినట్లు ఆయన అనుచరులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి కూడా పోటీపడుతున్నట్లు వెల్లడించారు. గొప్ప దేశమైన యూకే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు రిషి సునాక్ తెలిపారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోనంతగా దేశం సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ సమస్యలను పరిష్కరించడం కోసం తాను ప్రధాని బరిలో నిలుస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన చెప్పారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన రికార్డు కూడా తనకు ఉందన్నారు. సరైన వారిని ఎంపిక చేసుకుంటేనే అవకాశాలు కూడా అద్భుతంగా ఉంటాయన్నారు.
Ola S1 Air: ఓలా మరో సంచలనం.. బడ్జెట్ ధరలోనే కొత్త మోడల్
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
గత కొన్ని నెలల క్రితం బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ‘లిజ్ ట్రస్’ ప్రధాని పీఠమెక్కడం, కేవలం 45 రోజులకే అనుకోని పరిస్థితుల వల్ల పదవికి రాజినామా చేయడం వరుసగా జారిపోయాయి. అయితే ఆ ఎన్నికల్లో లిజ్ ట్రస్‌తో పోటీ పడి చివరి వరకు రేసులో నిలిచిన రిషి సునాక్.. ఇప్పుడు మరోసారి ప్రధాని పదవి అందుకోవడానికి రేసులో ముందు వరుసలో నిలిచారు. ప్రధాని పదవి రేసులో నిలిచేందుకు అవసరమైన 100 మంది టోరీ పార్టీ ఎంపీల మద్దతు తమ నేతకు లభించిందని సునాక్ అనుచరులు శనివారం వెల్లడించారు. పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ నేతగా పోటీ పడే అభ్యర్థికి కనీసం 100 మంది ఎంపీల మద్దతు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీకి 357 మంది ఎంపీలున్నారు. పెన్నీ మోర్డాంట్.. తాను ప్రధాని రేసులో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమెకు 20 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఇప్పటివరకు లభించినట్లు సమాచారం. మూడో అభ్యర్థిగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రంగంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా పోటీ రిషి సునాక్, బోరిస్ జాన్సన్‌ల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది.
The United Kingdom is a great country but we face a profound economic crisis.
That’s why I am standing to be Leader of the Conservative Party and your next Prime Minister.
I want to fix our economy, unite our Party and deliver for our country. pic.twitter.com/BppG9CytAK
— Rishi Sunak (@RishiSunak) October 23, 2022
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!