Money rain on Highway: హైవేపై డబ్బుల వర్షం, ఎగబడిన జనం.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money rain on Highway: సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే.. మరో ఆలోచన లేకుండా తీసుకుని మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోతుంటారు. అలాంటిది డబ్బుల వర్షం కురిస్తే ఎవరైనా ఊరుకుంటారా?. అలాంటి ఘటనే చిలీ దేశంలో జరిగింది. హైవేపై డబ్బుల వర్షం కురవడంతో జనం ఎగబడ్డారు. ఎక్కువ మొత్తాన్ని జమ చేసుకునేందుకు పరుగులు తీశారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయినా పట్టించుకోలేదు. చిలీలోని ఓ హైవేపై డబ్బుల వర్షం కురిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన నిజానికి గ్యాంబ్లింగ్ హాలులో జరిగిన దోపిడీతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది.
Srilanka: శ్రీలంకలో ఇల్లు అమ్మి తమిళనాడుకు చేరుకున్న మహిళ.. ఎందుకో తెలుసా?
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
పుడహూల్‌లోని ఒక క్యాసినోలో రాత్రి 7:45 గంటల ప్రాంతంలో దొంగలు దాడికి పాల్పడి భారీగా నగదు దోచుకున్నారని పోలీసులు వెల్లడించారు. గ్యాంబ్లింగ్ హాల్‌లోని సిబ్బందిని, అక్కడున్న వారిని ఆయుధాలతో బెదిరించి పరారైనట్లు కోఆపరేటివా మీడియా పేర్కొంది. దుండగులు తమ కారులో పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని వెంబడించడం ప్రారంభించారు. దీంతో వారు ఉత్తర తీర ప్రాంతానికి వెళ్లే హైవేపైకి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకోవడానికి దొంగలు కరెన్సీ నోట్లను హైవేపై వెదజల్లుతూ వెళ్లారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. కారును అడ్డగించి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఆరుగురిలో మొత్తం మంది విదేశీయులేనని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పారు. అయితే, వారు ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని బయటకు తెలపలేదు. మరోవైపు.. గ్యాంబ్లింగ్ హాల్‌లో, హైవేపై ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ డబ్బుల వర్షం దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
A violent robbery at a store ended in a police car chase, money raining down on a highway and six suspects getting arrested in Santiago, Chile#chile #santiago #chase #anews pic.twitter.com/KeHtPTQugh
— ANews (@anews) October 21, 2022
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!