Kerala Human Sacrifice: కేరళ నరబలి కేసులో ముగ్గురు నిందితులను తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఎర్నాకులం జిల్లాలోని పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్టు మహ్మద్ షఫీ, భగవల్ సింగ్, లైలాలను పోలీసు కస్టడీకి పంపింది. అంతకుముందు, 12 రోజుల పోలీసు కస్టడీని మంజూరు చేస్తూ ఎర్నాకులంలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ముగ్గురు నిందితులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసు కస్టడీకి సంబంధించిన ఉత్తర్వులను పక్కన పెట్టాలని కోరారు.
విచారణ సమయంలో వారు తమ న్యాయవాదిని కలిసేందుకు అనుమతిని కోరారు. అదే సమయంలో తమ ఒప్పుకోలు ప్రకటన వివరాలను మీడియా ద్వారా విడుదల చేయకూడదని ఆదేశాలు కూడా కోరారు. ఇంతలో కేరళ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది, అయితే 15 నిమిషాల పాటు వారి న్యాయవాదిని కలవడానికి మాత్రం వారికి అనుమతి ఇచ్చింది. వారి పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇద్దరు మహిళలను దారుణంగా నరబలి ఇవ్వడం కేరళ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని న్యాయస్థానం పేర్కొంది.
TRS MLAs Trap: పోలీసులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే..?
ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన కేసు కేరళలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టగా.. వెన్నులో వణుకు పుట్టించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. నిందితులను ప్రేరేపించడం నుంచి మహిళలను తీసుకొచ్చి నరబలి ఇచ్చిన ప్రతీ విషయంలో మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డబ్బుకు ఆశపడిన ఓ దంపతులు దారుణానికి తెగబడ్డారు. ఏకంగా ఇద్దరు యువతులను దారుణంగా నరబలి ఇచ్చారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిని నిందితులు భగవల్ సింగ్ అతని భార్య లైలాలు డబ్బు ఆశకోసం ఇద్దరని దారుణంగా హత్య చేశారు. వీరిద్దరికి రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ సహకరించారు. ముగ్గురు కలిసి ఇద్దరు యువతులను నరబలి ఇచ్చారు. 50 ఏళ్లుగా లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న ఇద్దరు మహిళలను వీరు టార్గెట్ చేశారు. పతనంతిట్ట జిల్లాలోని సింగ్ మరియు లైలా నివాసం సమీపంలోని ఓ స్థలంలో పద్మ, రోస్లిన్‌గా గుర్తించబడిన ఇద్దరు మహిళల అవశేషాలు బయటపడ్డాయి. డబ్బు కోసం ప్రలోభపెట్టి ఇద్దరు మహిళలను క్రూరంగా హత్య చేసిన నరబలి కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ షఫీని విచారిస్తున్నట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ ధ్రువీకరించారు.